Payyavula Keshav: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వ వైఖరి చెపుతాం..! 24 d ago
అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాతే విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వ వైఖరి తెలియజేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. ఈ అంశంపై గతంలో తాను హైకోర్టుకు కూడా వెళ్లానని గుర్తు చేసారు. కాబట్టి దీని గురించి తాను ఎక్కువగా మాట్లాడితే బాగుండదని ఆర్థిక, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీఎం ప్రకటన మేరకు నడుచుకుంటామని కేశవ్ పేర్కొన్నారు.